- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం చౌటుప్పల్ లో మహాధర్నా కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ. పాషా, నాయకులు బత్తుల దాసు, తూర్పు నూరి మల్లేశం, కందగట్ల ఆనంద్, కనకయ్య, చీకూరు ఈదయ్య, జంగయ్య, రాములు, రాజు, పాల్గొన్నారు.






