‘మసూద’ డైరెక్టర్‌తో నాగచైతన్య హారర్ థ్రిల్లర్ సినిమా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-14 10:28:05  IST  )

ఈ ఊహాగానాలకు నాగచైతన్య టీమ్ బ్రేక్ వేస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు కొట్టిపారేశారు.

‘మసూద’ డైరెక్టర్‌తో నాగచైతన్య హారర్ థ్రిల్లర్ సినిమా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య గత ఏడాది ‘తండేల్’ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే జోష్‌లో ఉన్న ఆయన ప్రస్తుతం ‘ధూత-2’వెబ్ సిరీస్, ‘వృషకర్మ’ సినిమా షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. కార్తీక్ దండు దర్శకత్వంలో రాబోతున్న మిథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ‘మసూద’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ పవర్‌ఫుల్ హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ బ్యానర్‌పై నిర్మించనున్నారని టాక్.

సాయి కిరణ్ చెప్పిన కథ చైతూకి బాగా నచ్చడంతో.. ఆయన ఈ ప్రాజెక్ట్‌కి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, ప్రస్తుతం చేస్తున్న వృషకర్మ షూటింగ్ పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని పలు పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఈ క్రేజీ హారర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. అయితే, ఈ ఊహాగానాలకు నాగచైతన్య టీమ్ బ్రేక్ వేస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు కొట్టిపారేశారు. డైరెక్టర్ సాయి కిరణ్‌తో చైతన్య సినిమా ఖరారు అయిందనే వార్తలను పూర్తిగా ఖండించారు. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య ఎలాంటి కథా చర్చలు కానీ, అఫీషియల్ మీటింగ్స్ కానీ జరగలేదని చైతూ టీమ్ స్పష్టం చేసింది. ఈ అధికారిక వివరణతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ హారర్ ప్రాజెక్ట్ రూమర్స్‌కు పూర్తిగా చెక్ పడినట్లు అయింది.

మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిన అఖిల్ సంతోషం.. ‘లెనిన్’లో ఆ సీన్ కాపీ అంటూ దారుణ ట్రోల్స్

Next Story