- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిన అఖిల్ సంతోషం.. ‘లెనిన్’లో ఆ సీన్ కాపీ అంటూ దారుణ ట్రోల్స్
ఈ సినిమాకే అత్యంత కీలకమైన, హైలైట్‌గా నిలిచిన క్లైమాక్స్ సీన్.. 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘కృష్ణబాబు’ మూవీలోని సీన్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలవడంతో కొద్ది కాలం పాటు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత అఖఇల్ ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మురళి కిశోర్ అబ్బురి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భాగ్యశ్రీబోర్సే హీరోయిన్‌గా నటించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయగా.. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా భారీగా ప్రశంసలు పొందుతూ థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. మూడేళ్ల తర్వాత తన సినిమా ఇలా గ్రాండ్ సక్సెస్ కావడంతో అఖిల్ ఎంతో సంతోషంలో మునిగితేలుతున్నారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండటంతో.. అందరి దృష్టి అంతా ‘లెనిన్’ చిత్రంపైనే పడింది.
అయితే, ఒకవైపు ఇంత పెద్ద సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే.. మరోవైపు ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ మొదలైంది. ‘లెనిన్’ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ కొట్టారంటూ నెట్టింట పలు పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ సినిమాకే అత్యంత కీలకమైన, హైలైట్‌గా నిలిచిన క్లైమాక్స్ సీన్.. 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘కృష్ణబాబు’ మూవీలోని సీన్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ రెండు సీన్లకు సంబంధించిన వీడియోలను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కృష్ణబాబు’ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. 1999లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ పాత సినిమాలోని సీన్‌ను లెనిన్ దర్శకుడు మురళి కిశోర్ కాపీ కొట్టారంటూ ట్రోలర్స్ రచ్చ చేస్తున్నారు. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్నప్పటికీ, ఈ కాపీ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అఖిల్ సంతోషం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






