- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వియత్నాం నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు తెలుగువారి మృతదేహాలు.. స్వగ్రామాలకు తరలింపు!
వియత్నాంలో మృతి చెందిన పర్యాటకుల్లో ముగ్గురు తెలుగువారి మృతదేహాలను ఈరోజు ముంబై మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

దిశ, శంషాబాద్: వియత్నాంలో మృతి చెందిన పర్యాటకుల్లో ముగ్గురు తెలుగువారి మృతదేహాలను ఈరోజు ముంబై మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మొత్తం 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం రాత్రి 9:35 గంటలకు వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానం VN979 ద్వారా ముంబైకి చేరుకోనున్నాయి. అనంతరం కస్టమ్స్, వైద్య పరీక్షలు, ఇతర చట్టపరమైన క్లియరెన్స్ ప్రక్రియలు పూర్తయ్యేందుకు సుమారు 5–6 గంటల సమయం పట్టింది. అనుమతులన్నీ పూర్తయిన తర్వాత ముగ్గురు తెలుగువారి మృతదేహాలను మంగళవారం తెల్లవారుజామున ఇండిగో విమానం 6E6362 ద్వారా ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ఈ విమానం ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రోటోకాల్ బృందం మృతదేహాలను స్వీకరించింది. అనంతరం జిల్లా కలెక్టర్లు నియమించిన అధికారులు, అంబులెన్సుల ద్వారా మృతదేహాలను కడప, మచిలీపట్నం, హిందూపూర్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండగా మరి కొందరు ప్రయాణికులు సోమవారం వియత్నాం నుంచి వచ్చారు. కొన్ని మృతదేహాలు కూడా రావడంతో నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలకు తరలించారు.






