- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ టార్గెట్ "పికియాక్స్ పర్వతం".. అసలు ఏముంది అక్కడ?
ఇరాన్‌లోని అత్యంత రహస్య అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌లోని అత్యంత రహస్య అణు కేంద్రాన్ని(Nuclear Site) లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఇరాన్‌లోని ప్రసిద్ధ నటాంజ్ (Natanz) అణు క్షేత్రం సమీపంలో ఉన్న 'పికియాక్స్ పర్వతం' (Pickaxe Mountain) ఇప్పుడు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ఇది ఇరాన్ దేశంలోనే అత్యంత లోతులో, అత్యంత సురక్షితమైన భూగర్భ అణు సైట్‌గా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
పర్వతం కింద అభేద్యమైన అణు కోట
ఇరాన్ సైన్యం ఈ పికియాక్స్ పర్వతం కింద ఉన్న కఠినమైన గ్రానైట్ రాళ్లను తొలిచి, భూగర్భంలో సుమారు 100 మీటర్ల కొన్ని చోట్ల ఏకంగా 2,000 అడుగుల లోతున అత్యాధునిక అణు మౌలిక వసతులను నిర్మించింది. ఈ అండర్‌గ్రౌండ్ ల్యాబ్‌లలో యురేనియం ఎన్రిచ్మెంట్ హాల్స్ (Uranium Enrichment Halls) తో పాటు అణు ఇంధన నిల్వలను భద్రపరిచారు. గతంలో ఇరాన్‌కు రక్షణ కవచంగా భావించిన 'ఫోర్డో' (Fordow) అణు కేంద్రం కంటే ఈ పికాక్స్ సైట్ చాలా లోతుగా, బలంగా, వైమానిక దాడులను తట్టుకునేలా నిర్మించబడింని సమాచారం.
ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ప్రస్తుతం పికియాక్స్ పర్వతం కింద ఉన్న ల్యాబ్‌లలో అణ్వాయుధాల తయారీ యాక్టివ్‌గా లేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నప్పటికీ, అమెరికా మాత్రం దీనిని తీవ్రంగా అనుమానిస్తోంది. భవిష్యత్తులో ఇరాన్ ఇక్కడి నుండే అత్యంత రహస్యంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) తయారు చేసే ప్రమాదం ఉందని వైట్ హౌస్ భావిస్తోంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, అందుకోసం ఈ సైట్‌పై దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
బంకర్ బస్టర్లు కూడా పని చేయని వైనం
అమెరికా సైన్యం వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సాంప్రదాయ బాంబు GBU-57 (Massive Ordnance Penetrator - MOP). 30,000 పౌండ్ల బరువుండే ఈ బంకర్ బస్టర్ బాంబు ఎంతటి భూగర్భ స్థావరాలనైనా చీల్చుకుంటూ వెళ్లగలదు. అయితే, పికాక్స్ పర్వత గ్రానైట్ శిలల పొరలు, అది ఉన్న లోతు దృష్ట్యా, ఈ అత్యాధునిక బంకర్ బస్టర్ కూడా ఆ అణు ల్యాబ్‌లను పూర్తిగా ధ్వంసం చేయలేదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేయాలంటే అమెరికాకు 'టాక్టికల్ న్యూక్లియర్' లేదా భారీ స్థాయిలో నేలమార్గం ద్వారా సైనిక బలగాలను పంపే 'గ్రౌండ్ ఆపరేషన్' మాత్రమే ప్రత్యామ్నాయాలని విశ్లేషిస్తున్నారు. గతంలో ఇరాన్‌కు చెందిన ఫోర్డో, నటాంజ్ వంటి ప్రాథమిక సైట్లపై సైబర్ దాడులు, అంతర్గత విద్రోహ చర్యలు జరిగినప్పటికీ.. ఈ పికియాక్స్ పర్వతం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ చిక్కకుండా సురక్షితంగా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఈ అణు కోటపై అమెరికా ఎలాంటి అడుగు వేయబోతుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.






