- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల పిల్లల ఫీజుల రాయితీని అమలు చేయాలి.. ఎంఈఓకు వినతి పత్రం సమర్పణ
సమాజంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ నాయకులు కోరారు.

దిశ,బూర్గంపాడు: సమాజంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) యూనియన్ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు(అక్రిడిటేషన్) కలిగిన ప్రతి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించిన జీవోను బూర్గంపాడు మండల పరిధిలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బూర్గంపాడు మండల పరిధిలో శతాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్న పలువురు జర్నలిస్టుల పిల్లలకు ఈ 50 శాతం ఫీజు రాయితీని వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం బూర్గంపాడు మండల విద్యాశాఖ అధికారి యదు సింహరాజుకు యూనియన్ సభ్యులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
జర్నలిస్టుల వినతిపై ఎంఈవో సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పిల్లల కోసం అందిస్తున్న విద్యా ఫీజు రాయితీని మండలంలో కచ్చితంగా అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే మండల పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన జర్నలిస్టుల పిల్లలందరికీ ఈ రాయితీ వర్తించేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జర్నలిస్ట్ నాయకులు, సభ్యులు చంద్రశేఖర్, జోషి, సాంబరెడ్డి, శ్రీనివాస్, నరసింహారెడ్డి, రాంబాబు, రమేష్, రవి మల్లారెడ్డి, శ్రీనివాస్ సుధాకర్,శివకుమార్ ముజఫర్ తదితరులు పాల్గొన్నారు.






