- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారేపల్లి రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీ.. ప్రయాణికుల సమస్యలపై ఆరా
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణ మంగళవారం ప్రత్యేక రైలులో పర్యటిస్తూ కారేపల్లి రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

దిశ, కారేపల్లి: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణ మంగళవారం ప్రత్యేక రైలులో పర్యటిస్తూ కారేపల్లి రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని ప్రయాణికుల సౌకర్యాలు, నిర్వహణ తీరును పరిశీలించి, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేవలను మరింత మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్‌లో కొనసాగుతున్న రెండో రైల్వే లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు డోర్నకల్, భద్రాద్రి కొత్తగూడెం మధ్య కరోనా సమయంలో నిలిపివేసిన పలు రైళ్లను తిరిగి ప్రారంభించాలని డీఆర్‌ఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డాక్టర్ గోపాలకృష్ణ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్, రైల్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.






