- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు.. అడిషనల్ కలెక్టర్
విద్యార్థులకు చదువుతోనే ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు.

దిశ, బెజ్జూర్ : విద్యార్థులకు చదువుతోనే ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం బెజ్జూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, సీఎస్సీ, కస్తూరిబా గాంధీజీ గురుకుల విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. చదువుతోనే విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తు ఉందన్నారు.
సీఎస్సీ కేంద్రంలోని అన్ని వార్డులను క్షణంగా పరిశీలించారు. పేద ప్రజలు సక్రమంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో శిథిలావస్థలో ఉన్న రూములను గదులను పరిశీలించారు. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. కస్తూర్బా, గిరిజనబాలికల ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారుల ఆదేశించారు. ఆయన వెంట బెజ్జూర్ ఎంఈఓ సునీత, కస్తూర్బా ప్రత్యేక అధికారి జి.అరుణ, గిరిజన బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గావిడ మారుబాయి, స్థానిక సర్పంచి దుర్గం సరోజ, గ్రామపంచాయతీ కార్యదర్శి వైకుంఠం ఉన్నారు.






