దివంగత సింగర్ జానకి మనవరాలి ఎమోషనల్ పోస్ట్

by Muthe.Rajitha |

దివంగత దిగ్గజ గాయని, గానకోకిల ఎస్. జానకి మనవరాలు చేసిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది.

దివంగత సింగర్ జానకి మనవరాలి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత దిగ్గజ గాయని, గానకోకిల ఎస్. జానకి మనవరాలు చేసిన ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది. జానకి మరణం తర్వాత వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై ఆమె మనవరాలు అప్సర విద్యుల్ (Apsara Vidyul) తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన, హావభావాలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు చేసిన విమర్శలు, ట్రోల్స్‌కు స్పందనగా అప్సర తన అధికారిక ఖాతాలో ఒక సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

"కనిపించని కన్నీళ్లను మా బాధతో ముడిపెట్టొద్దు" అంటూ అప్సర విద్యుల్ నెటిజన్లను ఉద్దేశించి ఘాటుగా రాసుకొచ్చారు. "ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు కుటుంబం అనుభవించే బాధ అత్యంత వ్యక్తిగతమైనది. అంత్యక్రియల సమయంలో మేము ప్రదర్శించిన దుఃఖాన్ని, మా ముఖ కవళికలను పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టి విమర్శించడం, ట్రోల్ చేయడం అత్యంత అమానుషం. కెమెరాల ముందు కన్నీళ్లు కార్చలేదో, గుండెలు బాదుకోలేదో అని మాకు బాధ లేదని అర్థం కాదు. మా ప్రైవేట్ వేదనను పబ్లిక్ హేళనకు గురి చేయవద్దు" అని ఆమె నెటిజన్లను వేడుకున్నారు.

ఎస్. జానకి లాంటి మహోన్నత కళాకారిణి భౌతికంగా దూరమవడంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోగా, మరోవైపు అంత్యక్రియల వేళ కుటుంబ సభ్యులపై కొందరు నెటిజన్లు ఆన్‌లైన్ వేదికగా చేసిన ట్రోలింగ్ తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అప్సర చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ఆవేదనకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు మెజారిటీ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఒక కుటుంబం అంతటి పెద్ద విచారంలో ఉన్నప్పుడు వారి వ్యక్తిగత జీవితానికి మరియు బాధకు కనీస గౌరవం ఇవ్వాలని, సోషల్ మీడియా రీచ్ కోసం ఇలాంటి సున్నితమైన విషయాలను ట్రోల్ చేయడం ఆపాలని క్రియేటర్లు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Next Story