- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తున్న ఎన్డీఏ ఓటర్లు.. C- ఓటర్ సర్వేలో షాకింగ్ నిజాలు
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్ విధానంపై సీ-వోటర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇటీవల ఈ సర్వేను నిర్వహించగా.. ఎన్డీఏకు ఓటు వేసివారిలో 52.5 శాతం మంది ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తేలింది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్ విధానంపై సీ-వోటర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇటీవల ఈ సర్వేను నిర్వహించగా.. ఎన్డీఏకు ఓటు వేసివారిలో 52.5 శాతం మంది ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. ఇథనాల్ కలపడం వల్ల తమ వాహనాలు దెబ్బ తింటాయని, మైలేజీ తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఎన్డీఏ ఓటర్లలో 18.1 శాతం మంది మాత్రమే ఈ 20 పెట్రోల్ విధానాన్ని ఇష్టపడ్డారని తెలిసింది. మరో 29.5 శాతం మంది ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. కేంద్రంలోని ఇథనాల్ మిక్సింగ్ విధానానికి సపోర్ట్ చేయడం కంటే వాహనాల పనితీరుపై ఉన్న ఆందోళనల వల్లనే ఇలాంటి సర్వే ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఎన్డీఏ కాకుండా ప్రతిపక్ష మద్దతు దారుల్లో వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉన్నట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 57.9 శాతం మంది తాము ఈ 20 పెట్రోల్ కు వ్యతిరేకం అని చెబుతున్నారు. అదే విధంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నవారిలో 55 శాతం మంది ఈ విధానాన్ని తిరస్కరించారు. ఎన్డీఏ, ప్రతిపక్షం, ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్న అందరు ఓటర్లలో కలిపి 55.1 శాతం మంది ఈ20 పెట్రోల్ ను వ్యతిరేకించారు. మొత్తంగా 17.1 శాతం మంది మాత్రమే మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల నష్టపోయిన ఒక్క వ్యక్తిని అయినా చూపించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సవాల్ విసిరిన కొద్ది రోజులకే ఈ సర్వే ఫలితాలు వచ్చాయి.






