క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!

by Mallepaka Hamsa |

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో మృణాల్ ఠాకూర్ రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. సంప్రదాయమైన లుక్స్‌తో, అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ, ఇటీవల ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. అయితే సినిమాల కంటే కూడా మృణాల్ తన వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా లవ్ లైఫ్, పెళ్లి రూమర్స్‌తోనే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటారు. అయితే ఇన్నాళ్లు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె డేటింగ్‌లో ఉందంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఏ సినిమా చేయనప్పటికీ, పలు ప్రైవేట్ ఈవెంట్లలో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ రూమర్స్ గట్టిగా వినిపించాయి.

అయితే వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినట్లు టాక్. ఈ బ్రేకప్ వార్తలు ఇలా ఉండగానే.. ఇప్పుడు మృణాల్ పేరు మరో ప్రముఖ వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో మృణాల్ ఠాకూర్ రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా మృణాల్ ఠాకూర్, రిషభ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఈ ఫాలోయింగ్ వెనుక ఏదో బలమైన కారణం ఉందంటూ నెటిజన్లు రకరకాల చర్చలు మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా.. రిషభ్ పంత్ తన సోదరి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండవ మహిళ మృణాల్ ఠాకూర్ మాత్రమేనని తెలుస్తోంది. ఈ ఒక్క విషయమే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది.

Next Story