- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యారేజీలకు ఏం జరిగినా రాజీనామా చేస్తాం.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కు కౌశిక్ రెడ్డి చాలెంజ్
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయబోమని కౌశిక్ రెడ్డి స్వాల్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తి పోయాలని ఆ క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏ చిన్న సమస్య వచ్చినా అందుకు పూర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేమంతా బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయమని సవాల్ విసిరారు. మా చాలెంజ్‍ను స్వీకరించే దమ్ము ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆవేదన చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నానన్నారు.
మా రక్తం తీసుకుని రైతులకు నీళ్లు ఇవ్వండి:
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని అవసరం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తం తీసుకుని రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం విషయంలో ఇన్నాళ్లు తాము చేసిన అబద్ధాలు ప్రజలకు అర్థం అవుతాయ నే కన్నెపల్లి పంప్ హౌస్ లు ఆన్ చేయడంలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మిమ్మల్నీ కుర్చీలో కూర్చోబెట్టడమే రైతులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. రైతులకు నీళ్లు ఇస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని, పండిన పంటలను కొనాల్సి వస్తుందనే చిల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు.






