- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్మోహన్ నాయుడు సహకారం మరవలేనిది.. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ కామెంట్స్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడ కేంద్రమంత్రులతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడ కేంద్రమంత్రులతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు సంబంధించి రామ్మోహన్ నాయుడు, అధికారులతో చర్చించామని చెప్పారు. రామ్మోహన్ నాయుడు ఎప్పుడు ఎయిర్ పోర్టుల గురించి అడిగినా అధికారులతో మాట్లాడి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు.
ప్రధాని మోడీ వికసిత్ భారత్ తో 2045 నాటికి 30 ట్రిలియల్ డాలర్స్ ఎకానమిగా దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలని భావిస్తున్నారని తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ జీడీపీ 5శాతంగా ఉందని, దానిని 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రచించినట్టు తెలిపారు. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు రావాలన్నా విమానాశ్రయాలు అవసరం అని చెప్పారు. జూన్ 2, 2028 నాటికి ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్టులను పూర్తి చేస్తామనే నమ్మకం కలిగిందన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్టుకు కాకతీయ కళాకండాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. జూన్ 2, 2028 నాటికి ఎయిర్ పోర్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు 1500 ఎకరాల భూమి సేకరిస్తామని చెప్పారు. డిఫెన్స్ కు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ చాలా అవసరం అని అన్నారు. ఉడాన్ పథకంలో భాగంగా ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. కేంద్రానికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.






