- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. గడ్కరీతో కీలక భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నాయి. మంగళవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన ఆయన.. రీజనల్ రింగ్ రోడ్డు సహా తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. RRR నార్త్ పనుల ప్రారంభానికి నార్త్ పార్ట్ కు కేబినెట్ ఆమోదం సహా.. సదరన్ పార్ట్ కు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి వినతిపత్రం సమర్పించారు. అలాగే డ్రైపోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్రం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. పోర్టులకు దారి కల్పించే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
కాసేపట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో మూడు ఎయిర్ పోర్టులకు సంబంధించి చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టుమాత్రమే పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా.. వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరనున్నారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయి మెట్రో ఫేస్ -1, ఫేస్ -2కి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించనున్నారు.






