సింగరేణి నిధులు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టాలి:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Jakkula.Mamatha |

సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి తప్ప ఆ నిధులను కొడంగల్ సిద్దిపేట సిరిసిల్లకు ఎందుకు తల్లిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రశ్నించారు.

సింగరేణి నిధులు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టాలి:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి తప్ప ఆ నిధులను కొడంగల్ సిద్దిపేట సిరిసిల్లకు ఎందుకు తల్లిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రశ్నించారు. ఆయన మంగళవారం భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలోని 8 ఇంక్లైన్ కాలనీ సింగరేణి కార్మికులతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడం లేదని ఆయన అన్నారు. గత 17 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ నష్టాలకు కూరుకపోవడానికి వారే కారణమన్నారు. మొదట కాలనీ వద్ద కార్మికులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం అక్కడ బీజేపీ జెండాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎగుర వేశారు. కాంగ్రెస్ పార్టీ 2013కు ముందు సింగరేణి కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తుందని రూ.2 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగితే సుప్రీంకోర్టు అన్ని రద్దు చేసి ఆప్షన్లు ద్వారా ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని ఫామ్ హౌస్‌లో ఉన్న అతను కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడని ఉత్తరాలు రాస్తున్నారని,10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తాడిచర్ల 1ను ప్రైవేట్ చేసి ఎమ్మార్ కంపెనీకి అప్పజెప్పారని ఆయన అన్నారు. రూ.25,200 కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు పెట్టి పోయిందని ఆరోపించారు.

అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని కాంగ్రెస్ వచ్చి కేవలం రెండున్నర సంవత్సరాలలోనే రూ.25,275 కోట్లు అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. అన్నిటికి అప్పు అడిగే రేవంత్ రెడ్డి అప్పు చేసి సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కంపెనీ ఉంటేనే యూనియన్ లు ఉంటాయని, కార్మికులకు జెండా ముఖ్యం కాదు ఎజెండా ముఖ్యమన్నారు. నైనీ కోల్ బ్లాక్ కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ఆఫీసర్ లు సమ్మె చేస్తున్నారు. తనను కలవడానికి ప్రయత్నిస్తే ట్రాన్స్ఫర్‌లు చేస్తామాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తున్నారని, ఎవరో మెస్సి వచ్చిండని సింగరేణి డబ్బులు హైదరాబాద్‌లో ఖర్చు పెట్టారని, ఇది ఎంతవరకు సమంజసం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ ను రీయింబర్స్ మెంట్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Next Story