- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తుంబాడ్-2’లో ఆలియా భట్.. ప్రళయం రాబోతుందంటూ అంచనాలను పెంచేసిన మూవీ మేకర్స్
ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘తుంబాడ్ 2’ లోకి ఆలియాకు స్వాగతం. అత్యంత ప్రతిభావంతమైన నటీమణుల్లో ఆలియా ఒకరు.

దిశ, సినిమా: 2018లో విడుదలైన ‘తుంబాడ్’ భారతీయ హారర్ చిత్రాల్లో ప్రత్యేక గుర్తించు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక 2024లో రీరిలీజ్ అయినప్పుడు కూడా అద్భుతమైన స్పందనను రాబట్టుకుని భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో రాబోతున్న ‘తుంబాడ్-2’ చిత్రంలో సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సోహమ్ షా ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తొలి భాగం కంటే ఈ సీక్వెల్ మరో లెవెల్‌లో ఉండబోతుందనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాలో ఆలియాభట్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ పుకార్లకు చెక్ పెడుతూ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. నిర్మాత సోహమ్ షా సోషల్ మీడియాలో కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంటూ, మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘తుంబాడ్ 2’ లోకి ఆలియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చిందని కన్ఫర్మ్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సోహమ్ షా.. "ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘తుంబాడ్ 2’ లోకి ఆలియాకు స్వాగతం. అత్యంత ప్రతిభావంతమైన నటీమణుల్లో ఆలియా ఒకరు. పూర్తిగా ఆమెను కొత్త కోణంలో చూడబోతున్నారు. ప్రళయం రాబోతోంది థియేటర్లలో కలుద్దాం" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు.
ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్‌లో అలియా, సోహమ్ కలిసి ఎంతో ఉత్సాహంగా పోజులిచ్చిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలియా భట్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘తుంబాడ్’ను మొదటిసారి చూసినప్పటి నుంచి ఆ సినిమా నా మనసులో నిలిచిపోయింది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో పని చేసే అవకాశం రావడం చాలా ప్రత్యేకం. ‘తుంబాడ్’ లాంటి మర్మమైన కథలో కొత్త తరహా పాత్రను పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో అలియా కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పూర్తి స్థాయి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఆల్ఫా’వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆలియా ఈ చిత్రంలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘తుంబాడ్-2’ కోసం ముంబైలో దాదాపు 7 నుండి 8 ఎకరాల భారీ సెటప్‌ను నిర్మించి, మొదటి భాగంలోని గూస్‌బంప్స్ తెప్పించే ‘తుంబాడ్’ ప్రపంచాన్ని మళ్లీ సృష్టించబోతున్నట్లు సమాచారం. ఈ భారీ విజువల్ వండర్ సినిమాను 2027 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.






