- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీకి గుర్తు తెలియని వ్యక్తుల తాళం
తల్లాడ మండలం కేశవపురం గ్రామ పరిధిలోని గ్రామ శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దిశ,తల్లాడ: తల్లాడ మండలం కేశవపురం గ్రామ పరిధిలోని గ్రామ శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయ హుండీకి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అక్రమంగా తాళం వేయడం పై గ్రామ పెద్దలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపురం గ్రామ పరిధిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీకి గతంలో ఒక తాళం వేసి ఉండగా, ఈ నెల 5వ తేదీన కొందరు వ్యక్తులు వచ్చి దానికి అదనంగా మరో తాళం వేశారు.
గతంలోనే ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు సమక్షంలో హుండీని తెరిచి చూడగా సుమారు రూ.58,000 నగదు వచ్చినట్లు భక్తులు పేర్కొన్నారు. ఈ నగదును ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం గుడి కి రంగులు వేసినట్లు వారు తెలిపారు, గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కమిటీతో సంబంధం లేని కొందరు వ్యక్తులు ఆలయ హుండీకి, ప్రవేశ ద్వారానికి అక్రమంగా తాళాలు వేసి వెల్డింగ్ చేయించారని గ్రామ పెద్దలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదానికి కారణమైన సదరు వ్యక్తుల పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని తల్లాడ ఎస్ఐ కు ఫిర్యాదు చేశారు.






