మాసబ్ ట్యాంక్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

by Jakkula.Mamatha |

మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసీ రోడ్డు మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఒక గుర్తుతెలియని వ్యక్తి కేబుల్ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మాసబ్ ట్యాంక్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కార్వాన్: మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసీ రోడ్డు మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఒక గుర్తుతెలియని వ్యక్తి కేబుల్ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సుమారు 4:00 నుంచి 5:00 గంటల మధ్య కాలంలో స్థానికులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చు. హిందూ సంప్రదాయానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. పసుపు, నలుపు రంగు చారల టీ-షర్ట్, నల్లటి ప్యాంట్ ధరించి ఉన్నారు. ఘటన స్థలంలో మృతుని చేతిలో ఒక హెల్మెట్ లభించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మెహదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story