గాంధీ ఆసుపత్రిలో బీపీ మిషన్ చోరీ!.. దొంగతనం చేస్తూ రీల్స్ చేసిన యువకుడు

by Prasad Jukanti |

గాంధీ ఆసుపత్రిలో బీపీ మిషన్ దొంగిలించి, ఇన్‌స్టాలో రీల్ పెట్టిన యువకుడి వీడియో వైరల్‍గా మారింది.

గాంధీ ఆసుపత్రిలో బీపీ మిషన్ చోరీ!.. దొంగతనం చేస్తూ రీల్స్ చేసిన యువకుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా పిచ్చి, రీల్స్ మోజులో కొంత మంది రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తున్నారు. తమ వ్యూస్, లైకులు, షేర్ల కోసం అడ్డమైన పనులు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ బడాయిలకు పోతున్నారు. తాజాగా ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలో దొంగతనం చేస్తూ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక యువకుడి నిర్వాకం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. యావత్ తెలంగాణలో పేదల పెద్దాసుపత్రిగా పేరున్న సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఓ యువకుడి చోరీకి పాల్పడ్డాడు. అక్కడి రోగుల కోసం ఉపయోగించే ప్రభుత్వ ఆస్తి అయిన బీపీ మిషన్ (BP Apparatus) ను గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించాడు. అంతటితో ఆగకుండా ఈ చోరీ విషయాన్ని వీడియో తీశాడు. ఓ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో తీసిన సమయం 3 AM అని ఉంది. ఇందులో సదరు యువకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. బీపీ చెక్ చేయమంటే చెక్ చేయడం లేదు. అందుకే ఏకంగా బీపీ మిషన్ ఎత్తుకెళ్తున్నానటూ మాట్లాడాడు. చేతిలో ఓ ఎలక్ట్రానికి బీపీ ఆపరేటర్‍ పట్టుకుని ఆసుపత్రిలో మెట్ల మార్గంలో కిందకు దిగుతున్న దృశ్యాలు ఈ వీడియో కనిపిస్తున్నాయి.

నెటిజన్ల ఆగ్రహం:

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లైకులు, వ్యూస్ కోసం మరీ ఇంత బరితెగిస్తారా? ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందించే పరికరాలను ఎత్తుకెళ్లి ఇలా షోలు వేస్తారా? మండిపడుతున్నారు. ఈ వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు నిజానిజాలేంటో తెలుసుకుని సదరు వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకుండా తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story