సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. పంట పొలాల్లో రక్తం చల్లి నిరసన తెలిపిన రైతులు

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం సేవాలాల్ తండా గ్రామపంచాయతీ(పంది బండ తండ)లో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గుగులోతు కవిత అనిల్ ఆధ్వర్యంలో రైతులు తమ రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లి నిరసన వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. పంట పొలాల్లో రక్తం చల్లి నిరసన తెలిపిన రైతులు
X

దిశ, చివ్వేంల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తంతో పంటలు పండించవచ్చని తెలిపిన దాని ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం సేవాలాల్ తండా గ్రామపంచాయతీ(పంది బండ తండ)లో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గుగులోతు కవిత అనిల్ ఆధ్వర్యంలో రైతులు తమ రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతు గుగులోతు లాలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు లేకుండా రక్తంతో పంటలు పండించవచ్చని తెలియజేయడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమ రక్తాన్ని ముఖ్యమంత్రికి ఇస్తామని వారు రక్తంతో పంటలు ఎలా పండించాలో తెలియజేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుగులోతు వెంకన్న, గుగులోతు మాన్సింగ్, బోడియా, మహిళా రైతులు వీరమ్మ, బుజ్జి, మస్రు తదితరులు పాల్గొన్నారు.

Next Story