అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.. ‘సర్’ ప్రక్రియపై ఆర్డీవో సుమ హెచ్చరిక

by Taduka Kalyani |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ ఆర్డీవో సుమ హెచ్చరించారు.

అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.. ‘సర్’ ప్రక్రియపై ఆర్డీవో సుమ హెచ్చరిక
X

దిశ, పర్వతగిరి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ ఆర్డీవో సుమ హెచ్చరించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అన్నారం షరీఫ్, అన్నారం పెద్ద తండా, కోంకపాక గ్రామాల్లో నిర్వహిస్తున్న ‘సర్’ డేటా డిజిటలైజేషన్ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయక్‌లతో కలిసి రికార్డులను, ఓటరు నమోదు మార్పులు చేర్పులు తోలగింపు సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్డీవో సుమ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలతో పోలిస్తే పర్వతగిరి మండలంలో ఎన్యూమరేషన్ ప్రక్రియ అత్యంత నత్తనడకన సాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మందగించడంపై అధికారులను ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లు ఫారాలను నింపి అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో పేర్లు ఇతర వివరాలు నమోదు చేయడంలో బీవోలు, బిఎల్ఎలు ఓటర్లకు సహకరించాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవోలు ప్రతిరోజూ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, సిబ్బందిని సమన్వయం చేసుకొని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ హరిత,ఎపియం రాజిర్,కార్యదర్శి రఘు,స్థానిక ఉప సర్పంచ్ అనిత, బిఎల్వోలు, బిఎల్ఎలు మేడిశెట్టి కరుణాకర్, స్వప్న, అనిత, నర్మద,కందికట్ల అనిల్, బోట్ల మధు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story