- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవీ వ్యామోహం.. కన్నబిడ్డను బలితీసుకున్న కసాయి తండ్రి!
స్వార్థం ముందు తలవంచిన తండ్రి ప్రేమ నవమాసాలు మోసి కనేది తల్లి అయితే, ఆ బిడ్డకు జీవితాంతం నీడగా నిలవాల్సింది తండ్రి. కానీ, సర్పంచ్ పదవి దక్కించుకోవాలనే రాజకీయ వ్యామోహం ఆ తండ్రిలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది.

రాజకీయ కాంక్ష మనిషిని ఎంతటి రాక్షసుడిగా మారుస్తుందో చెప్పడానికి నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఒక నిదర్శనం. మహారాష్ట్రలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడిన ఓ తండ్రికి, తనకున్న ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారింది. నిబంధనల ప్రకారం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత ఉంటుందని భావించి, తన కన్నకూతురును కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. బైక్‌పై షికారుకు వెళ్దామని అల్లారుముద్దుగా నమ్మించి, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని ఎడపల్లికి తీసుకొచ్చిన ఆ కసాయి తండ్రి చిన్నారిని సజీవంగానే నిజాంసాగర్ కాలువలోకి తోసేశాడు.
జనవరి 29న కాలువలో లభించిన గుర్తు తెలియని పసిపాప మృతదేహం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఒక కానిస్టేబుల్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ద్వారా పాప వివరాలు సేకరించి, నిందితుడైన తండ్రి పాండురంగతోపాటు అతడికి ప్రోత్సాహమిచ్చిన సర్పంచ్ గణేష్ షిండేను అరెస్ట్ చేశారు. కన్నకూతురినే బలి తీసుకున్న ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. పదవి కోసం కన్న ప్రేమను కాలరాసిన ఆ రాక్షస తండ్రి ప్రవర్తనపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి కఠిన చర్యలకు ఉపక్రమించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: స్వార్థం ముందు తలవంచిన తండ్రి ప్రేమ నవమాసాలు మోసి కనేది తల్లి అయితే, ఆ బిడ్డకు జీవితాంతం నీడగా నిలవాల్సింది తండ్రి. కానీ, సర్పంచ్ పదవి దక్కించుకోవాలనే రాజకీయ వ్యామోహం ఆ తండ్రిలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనలు ఉండటంతో, తన మూడవ బిడ్డను ఎవరికైనా దత్తత ఇచ్చి వదిలించుకోవాలని చూశాడు. అయితే చట్టపరమైన ఇబ్బందులు ఎదురవడంతో, ఆ పసిప్రాణం తన ఎదుగుదలకు అడ్డుగా ఉందని భావించిన ఆ తండ్రి, కన్న ప్రేమను మరిచి కాలయముడిగా మారాడు.
నమ్మించి తీసుకెళ్లి కాలవలోకి తోసేసిన వైనం..
అన్నెం పున్నెం ఎరుగని ఆరేళ్ల చిన్నారి ప్రాచికి తన తండ్రే తన పాలిట మృత్యువు అవుతాడని తెలియదు. బైక్‌పై షికారుకు వెళ్దామని మాయమాటలు చెప్పిన తండ్రిని నమ్మి ఆ చిన్నారి అల్లారుముద్దుగా అతని వెంట వెళ్లింది. సరిహద్దులు దాటి ఎడపల్లి సమీపంలోని నిజాంసాగర్ కాలువ వద్దకు చేరుకోగానే, తనను ఎత్తుకున్న ఆ చేతులు ప్రాణాలను కాపాడతాయని ఆశించిన ఆ బిడ్డను, కసాయి తండ్రి కిరాతకంగా నిండు ప్రాణాలతో నీటిలోకి తోసేశాడు. పదవి కోసం కన్నపేగును తెంచుకోవడానికి కూడా వెనుకాడని ఆ తండ్రి రాక్షసత్వం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేసింది.
సాంకేతికతతో ఛేదించిన పోలీసులు..
కటకటాల్లోకి కసాయి జనవరి 29న కాలువలో శవమై తేలిన ఆ పసిపాప ఎవరనేది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే నిజామాబాద్ పోలీసుల చాకచక్యం, సోషల్ మీడియా వాడకంతో ఈ మిస్టరీ వీడింది. ఒక కానిస్టేబుల్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ద్వారా చిన్నారి వివరాలు బయటపడటంతో, అసలు నిందితుడైన తండ్రి పాండురంగతో పాటు అతనికి సలహా ఇచ్చిన సర్పంచ్ గణేష్ షిండేల గుట్టురట్టయింది. కన్న కూతురిని చంపి కూడా ఏమీ ఎరగనట్టు నటించిన ఆ కసాయి తండ్రిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.






