- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆవేదన
రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రానున్న పురపాలక ఎన్నిక(Municipal Elections)ల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందని అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని.. పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కేటీఆర్ ఆవేదన
గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి కూడా లేదన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయనం గాని సంక్షోభంలోకి నేడుతూ.. మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ సవాలు చేశారు.
మంచి ఫలితాలు సాధించాం
మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సన్నహక సమావేశం నిర్వహించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున చేసుకోవాల్సిన ఏర్పాట్లను ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు తెలియజేశారు. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితుల పైన క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
హరీష్ రావు దిశానిర్దేశం
జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పలు అంశాల పైన నేతలకు దిశా నిర్దేశం చేశారు. కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన పలు అంశాలను హరీష్ రావు నేతలకు వివరించారు. ఈ సమావేశాల సందర్భంగా ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని.. పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నదని తెలిపారు.
READ MORE .....






