KTR: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

by Prasad Jukanti |   (  Updated:2026-01-10 11:37:58  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నూతన సంవత్సరంలో అంతర్జాతీయ ఆహ్వానం అందింది.

KTR: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ లో ప్రసంగించాల్సిందిగా యూనివర్సిటీ ఆహ్వానించింది. “The India We Imagine” అనే థీమ్‌తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించబోతున్నారు. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల ఆధ్వర్యంలోని ఇండియా కాన్ఫరెన్స్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారత్‌తో పాటు దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి వెయ్యిమందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.

రెండో రోజు కేటీఆర్:

సదస్సులో భాగంగా మొదటి రోజు ఫిబ్రవరి 14న హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీపై, ఫిబ్రవరి 15 హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో వ్యాపారం, ఆంత్రప్రెన్యూర్‌షిప్, గ్లోబల్ ఎకానమీపై చర్చలు జరగనున్నాయి. డే–2లో ప్రసంగించాలని కేటీఆర్‌ను నిర్వాహకులు కోరారు. కాగా తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన కీలక పాత్రకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నది. హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్ విస్తరణ, స్టార్టప్ సంస్కృతి అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, అర్బన్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఆధారిత ఉద్యోగాల సృష్టి వంటి రంగాల్లో కేటీఆర్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. గతంలో ఈ వేదికపై నీతా అంబానీ, నితిన్ గడ్కరీ, అజీమ్ ప్రేమ్‌జీ, అజయ్ బంగా, జైరాం రమేష్, రాధికా గుప్తా, కరిష్మా కపూర్, సబ్యసాచి వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ప్రసంగించారు.

Read More..

నువ్వు అంత బాధపడాల్సిన అక్కర్లేదు.. హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్

బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆవేదన

Next Story