- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంటగలిసిన మానవత్వం.. బాలుడి మృతదేహాన్ని పక్కకు నెట్టి..
బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే.. ఓ పక్క బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు.. అదే సమయంలో చేపలు తీసుకెళ్లేందుకు మాత్రం గుంపులు గుంపులుగా ఎగబడిపోయారు. దీంతో పరిస్థితి విషమించి బాలుడు అక్కడే కన్నుమూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు వీళ్లు మనుషులేనా?.. బాలుడి ప్రాణాల కంటే చేపలు ముఖ్యమయ్యాయా? అని సీరియస్ అవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






