MLA Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కరోనా పాజిటివ్

by Vinod kumar |   (  Updated:2022-08-08 10:27:56  IST  )

BJP MLA Raghunandan Rao tests Corona Positive| సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు కు

BJP MLA Raghunandan Rao tests Corona Positive
X

దిశ, దుబ్బాక : BJP MLA Raghunandan Rao tests Corona Positive| సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఏరియా ఆస్పత్రి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యేకు వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా తమను కలిసిన కార్యకర్తలు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని, ఎవ్వరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక?

Next Story