బెంగాల్‌లో మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ

by Malleboina Mahesh |   (  Updated:2026-05-04 04:20:04  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

బెంగాల్‌లో మెజార్టీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ఎర్లీ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఎంసీకీ, బీజేపీకీ హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికి మొదటి, రెండు రౌండ్లు ఓట్ల లెక్కింపులోను ఇదే ఉత్కంఠ కొనసాగింది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఎర్లీ ట్రెండ్ లో బీజేపీలో 154 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మెజార్టీ మార్కును దాటడంతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార టీఎంసీ కూడా 108 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. చాలా నియోజకవర్గాల్లో వందల్లో మాత్రమే లీడ్ ఉండటంతో.. తుది పలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎర్లీ ట్రెండ్స్ తో టీఎంసీ కార్యాలయం, మమతా బెనర్జీ ఇంటి వద్ద నిశబ్ధ వాతావరణం నెలకొంది.

నేడు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు..ట్రెండింగ్‌లో త్రిష పేరు !

Next Story