నేడు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు..ట్రెండింగ్‌లో త్రిష పేరు !

by velandi.Saikiran |

ఈ రోజు 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో త్రిష పేరు వైరల్ గా మారింది.

నేడు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు..ట్రెండింగ్‌లో త్రిష పేరు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కోలీవుడ్ అందాల తార త్రిష, ఈ రోజు 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో త్రిష పేరు వైరల్ గా మారింది. ఈ బర్త్ డే ఉన్న నేపథ్యంలో త్రిష చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. హైవేపై తిరుపతి సైన్ బోర్డు చూపిస్తూ త్రిష పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారా ? ఇంకా ఏమైనా శుభవార్త చెబుతారా ? అంటూ రకరకాల కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు నెటిజన్స్.

అయితే పుట్టిన రోజు కావడంతో తిరుపతి వెళుతున్నారని కొంత మంది అంటున్నారు. ఈ రోజు విడుదల కాబోతున్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు హీరో విజయ్ కి అనుకూలంగా రావాలని కోరుకునేందుకు ఆమె తిరుపతి వెళ్తున్నారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ పుట్టిన రోజున విజయ్ కి మంచి ఫలితాలు వస్తే బాగానే ఉంటుంది... కానీ ప్రతికూల ఫలితాలు వస్తే త్రిషను ఆయ‌న‌ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇది ఇలా ఉండగా తమిళనాడు (Tamil Nadu ) రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 118 సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది.

Next Story