తాటి చెట్టు పై నుంచి జారిపడ్డ‌ గీత కార్మికుడు

by velandi.Saikiran |   (  Updated:2026-06-18 17:21:35  IST  )

తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.

తాటి చెట్టు పై నుంచి జారిపడ్డ‌ గీత కార్మికుడు
X

దిశ, ముస్తాబాద్: మండలంలోని చీకోడ్ గ్రామంలో గురువారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గౌడ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...చీకోడ్ గ్రామానికి చెందిన గున్నాల కిష్టా గౌడ్ తాటి చెట్లు ఎక్కి కల్లు గీసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతిరోజులాగే గురువారం తాటి చెట్లు గీయడానికి వెళ్లిన కిష్టా గౌడ్, చెట్టుపై జారిప‌డ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story