సెక్స్‌ కోసం భర్త టార్చర్.. కానీ అసలు సమస్య అతనిలోనే..

by Sujitha Rachapalli |

నా వయసు 55. మెనోపాజ్ దశలో ఉన్నాను. కొద్దిగా లావు కావడం వల్ల ఆకర్షణ కోల్పోయాను. నేను సెక్స్ జీవితానికి పనికి రానా? ఈ మాటలన్నీ మా ఆయన నాతో తరచూ అంటుంటారు.

సెక్స్‌ కోసం భర్త టార్చర్.. కానీ అసలు సమస్య అతనిలోనే..
X

ప్రశ్న: మేడం.. నా వయసు 55. మెనోపాజ్ దశలో ఉన్నాను. కొద్దిగా లావు కావడం వల్ల ఆకర్షణ కోల్పోయాను. నేను సెక్స్ జీవితానికి పనికి రానా? ఈ మాటలన్నీ మా ఆయన నాతో తరచూ అంటుంటారు. నిజంగా నేను దాంపత్య జీవితానికి పనికి రానా..? ఆయనకి 63 ఏళ్ళు.. బట్ట తల, పెద్ద పొట్టతో, సెక్స్‌లో బలహీనతలని పెట్టుకొని నన్ను సతాయిస్తున్నారు. ఈ వేధింపులు చిరాగ్గా అనిపిస్తున్నాయి. -లీల, హైదరాబాద్.

జవాబు : లీల గారూ.. మీకు 55, మీ వారికి 63.. ఆయన మేల్ మెనోపాజ్‌కు చేరుకోలేదా? ఇంకా యవ్వనంలో ఉన్నారా? బట్టతల, బాన పొట్ట, సెక్స్‌లో బలహీనత ఆయనకీ వచ్చాయని మీరూ గుర్తు చేయండి. యవ్వన కాలమంతా మీతో గడిపిన ఆనందమైన దాంపత్య జీవితానికి విలువే లేదా? తనలో లోపాలు పెట్టుకొని మిమ్మల్ని వేధించడం లౌక్యం కాక మరేంటి? వయాగ్రా వేసుకుంటే కానీ దాంపత్య జీవితం నెరపలేని అతను కొద్ది లావు.. తప్ప మరే లోపమూ లేని మిమ్మల్ని వేధించడం ఏమిటి? స్త్రీ పురుషులు ఇద్దరూ మెనోపాజ్/యాండ్రోపాజ్ దశలకు చేరుకున్నాక ఇద్దరికీ హార్మోన్ల లోపాలకు సంబంధించిన శారీరిక, మానసిక సమస్యలు ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపం వలన యోని నాళం పొడిబారి కలయిక మంట, నొప్పితో కూడి ఉండడం వలన సెక్స్‌ పట్ల భయం, విముఖత ఉంటుంది. హర్మోన్ల లోపం వలన డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండడం సెక్స్ పట్ల ఆసక్తి తక్కువగా ఉండేలా చేస్తుంది. భార్య మాత్రమే ముసలిది అయిపోయింది.. తనింకా యవ్వనంలోనే ఉన్నాననుకునే భ్రమల్లో బతికే భర్తల వల్ల ఇంకా చిరాకు పెరిగిపోతుంది. మీ 63 ఏళ్ల భర్త ఈ విషయంలో మారాలి. ఇక చికిత్సకు, పొడి బారిన యోనిలోకి ఈస్ట్రోజెన్ హార్మోన్ క్రీమ్ వాడాలి. ఆహారంలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండే సోయా బీన్స్ లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర పదార్థాలు తగ్గించాలి. దానివల్ల కొవ్వు పేరుకు పోదు. రోజూ వాకింగ్, యోగా చేస్తూ ఉంటే.. ఉత్సాహంగా ఉంటూ మంచి డిప్రెషన్ తగ్గించే హెల్తీ హార్మోన్లు విడుదల అవుతాయి.

Next Story