- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon: అమెజాన్ ప్రైమ్ డే తేదీ ఫిక్స్
ఈసారి 10వ వార్షికోత్సవ ఎడిషన్ కావడంతో అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, వందలాది కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు చేపట్టనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ డే-2026 సేల్ తేదీని ప్రకటించింది. జూలై 4 అర్ధరాత్రి ప్రారంభమై జూలై 6 రాత్రి వరకు 72 గంటల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఈసారి 10వ వార్షికోత్సవ ఎడిషన్ కావడంతో అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, వందలాది కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు చేపట్టనుంది. సేల్ సందర్భంగా వార్షిక ప్రైమ్ సభ్యత్వాన్ని రూ.1,499 నుంచి రూ.999కు, ప్రైమ్ లైట్‌ను రూ.599కు, ప్రైమ్ షాపింగ్ ఎడిషన్‌ను రూ.299కు అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో (ఈఎంఐ సహా) కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ వినియోగదారులకు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. శాంసంగ్, వన్‌ప్లస్, లెనొవొ, ఎల్‌జీ, అడిడాస్, పుమా వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి 500కుపైగా కొత్త ఉత్పత్తులు లాంచ్ కానుండగా, ఎకో, ఫైర్ టీవీ వంటి అమెజాన్ పరికరాలపై 45 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది.






