- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ చలో జంతర్ మంతర్.. విద్యార్థులు, ప్రజలకు కాక్‌రోచ్ జనతా పార్టీ పిలుపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన, నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన, నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఈ దేశవ్యాప్త నిరసనకు మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, పౌరులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
48 గంటల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య!
గత 48 గంటల్లో దేశంలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారని అభిజీత్ దిప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల వరుస మరణాలపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్న విద్యాశాఖ మంత్రి వెంటనే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 20న నిర్వహించ తలపెట్టిన ఈ శాంతియుత ధర్నాకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు ముందస్తు సమాచారం అందించామని, అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేశామని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. పోలీసుల నుండి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రారంభమై, లక్షలాది మంది మద్దతుతో దూసుకుపోతున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఈ నెలలో ఢిల్లీలో జరుగుతున్న రెండో ప్రధాన నిరసన ఇది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనలు తెలిపిన విషయం విదితమే.






