- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాగుల్స్ పెట్టుకుని జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొన్న గ్లెన్ ఫిలిప్స్.. కట్ చేస్తే ‘నెట్స్’లో క్రేజీ సీన్! (వీడియో)
కివీస్ సూపర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కళ్లద్దాలు పెట్టుకుని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ఫేస్ చేసే సాహసం చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) ఈ పేరును వినే ఉంటారు.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్. అతడిని ఎదుర్కొవాలంటే ఎలాంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌కైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. అతడి వేసే బంతి వేగానికి, షార్ప్ బౌన్సర్లకు గాయపడిన బ్యాటర్ల లిస్ట్ పెద్దగా ఉంది. అయితే, అంతటి డేంజరస్ బౌలర్‌ను న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కాస్త వెరైటీగా సవాల్ చేశాడు. కంటికి స్టైలిష్‌గా గాగుల్స్ (Goggles) పెట్టుకుని మరీ ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు నెట్స్‌లో సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డేరింగ్ ఓకే.. కానీ ఫైనల్ రిజల్ట్ ఇదే!
నెట్ ప్రాక్టీస్ సెషన్ (Practice Session)లో భాగంగా గ్లెన్ ఫిలిప్స్ కంటికి గ్లాసెస్ పెట్టుకుని క్రీజులోకి రాగా.. మరో ఎండ్‌లో బంతి పట్టుకుని ఉన్నది ఆర్చర్ అని తెలిసినా పిచ్‌పై బ్యాటింగ్ గార్డ్ తీసుకున్నాడు. అయితే, ఆర్చర్ తనదైన శైలిలో 145 కి.మీ ప్లస్ వేగంతో దూసుకొచ్చే బౌన్సర్‌ను విసిరాడు. ఆ వేగానికి, బౌన్స్ లెవెల్‌కు ఫిలిప్స్ గ్లాసెస్ పెట్టుకుని కూడా బంతిని సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. ఇద్దరి వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆర్చర్ స్పీడ్‌కు కళ్లద్దాలు కూడా పనిచేయవు బ్రో’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.






