ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రానికి BIG షాక్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-09 12:06:11  IST  )

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ది రాజాసాబ్ చిత్రానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.

ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రానికి BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ది రాజాసాబ్(The Rajasaab Movie) చిత్రానికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవోను కోర్టు సస్పెండ్ చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు సీరియస్ అయింది. టికెట్‌ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు మారడం లేదని ప్రశ్నించింది. కాగా, తెలంగాణలో ఈనెల 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’ టికెట్‌ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేయడంతో పాటు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

ఇదేం ట్విస్ట్ రా అయ్య.. ‘రాజాసాబ్’ లో ఏకంగా 8 మంది హీరోయిన్స్‌తో హంగామా

Next Story