ఇదేం ట్విస్ట్ రా అయ్య.. ‘రాజాసాబ్’ లో ఏకంగా 8 మంది హీరోయిన్స్‌తో హంగామా

by Mallepaka Hamsa |

భారీ అంచనాలతో జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్’(The Rajasaab).

ఇదేం ట్విస్ట్ రా అయ్య.. ‘రాజాసాబ్’ లో ఏకంగా 8 మంది హీరోయిన్స్‌తో హంగామా
X

దిశ, సినిమా: భారీ అంచనాలతో జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్’(The Rajasaab). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), దర్శకుడు మారుతి(maruthi) కాంబినేషన్ కావడంతో రిలీజ్‌కు ముందు సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. అయితే విడుదల తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోలేక మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు. తాజాగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు లేదా నలుగురు కాదు… ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్స్ నటించినట్లు మూవీ చూసిన ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు.

నానమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ జరీనా వహబ్ కనిపించగా, కోలీవుడ్ నటి అమ్ము అభిరామి, ఇనయా సుల్తానా, ఆనంది, మణీషా కందుకూర్ కూడా కీలక పాత్రల్లో నటించినట్లు సమాచారం.మొత్తంగా చూస్తే ఒక్క సినిమా కోసం ఇంత మంది హీరోయిన్స్‌ను పెట్టినా ఫలితం మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. “ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఎనిమిది మంది ఉన్నా సినిమాను హిట్ చేయలేకపోయారా?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మారుతి ప్లానింగ్ పూర్తిగా వర్కౌట్ కాలేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మిక్స్‌డ్ టాక్‌తో పాటు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ‘ది రాజాసాబ్ 2’కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Next Story