అమెరికాకు బిగ్ షాక్.. ఇరాన్ దాటికి కువైట్‌లో కూలిన F-15E యుద్ధ విమానాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-02 08:36:43  IST  )

కువైట్‌లో అమెరికా F-15 క్రాష్. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల మరిన్ని విమానాలు కూలిపోయాయని కువైట్ అధికారిక ప్రకటన. తమదే బాధ్యతని ప్రకటించిన ఇరాక్. అమెరికా మౌనం వెనుక ఉన్న రహస్యమేంటి?

అమెరికాకు బిగ్ షాక్.. ఇరాన్ దాటికి కువైట్‌లో కూలిన F-15E యుద్ధ విమానాలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ ఆసియాలో ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, కువైట్ గగనతలంలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ కూలిపోయింది. పశ్చిమ అల్ జహ్రా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం నియంత్రణ కోల్పోయి నేరుగా భూమి వైపు దూసుకు రావడాన్ని గమనించిన పైలట్లు వెంటనే బయటకు దూకేశారు. పారాచూట్ ద్వారా కిందకు దిగిన పైలట్లను స్థానిక కువైట్ పౌరులు సురక్షితంగా అధికారులకు అప్పగించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కువైట్, ఇరాక్ సంచలన ప్రకటనలు

ఈ ఘటనపై కువైట్ రక్షణ శాఖ స్పందిస్తూ అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల దాడి కారణంగా కువైట్ భూభాగంలో ఉన్న అనేక అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయని కువైట్ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా రంగంలోకి దిగి, తామే అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయని స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా మౌనం - ఫ్రెండ్లీ ఫైర్ అనుమానాలు..

కువైట్, ఇరాక్ దేశాలు అమెరికా విమానాల పతనంపై ప్రకటనలు చేసినప్పటికీ, అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ నష్టంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. విమాన శిధిలాలు కువైట్‌లోని మినా అల్ అహ్మదీ (Mina Al Ahmadi) రిఫైనరీ కాంప్లెక్స్‌లో పడటంతో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం కువైట్ భద్రతా దళాలు పైలట్లను తమ అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఇదిలా ఉంటే అమెరికా తమ యుద్ధ విమానాలు కూలిపోవడంపై చాకచక్యంగానే మౌనం వహిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Iran war : సౌదీ అరేబియాకు ఊహించని షాక్.. ‘అరామ్‌కో రిఫైనరీ’పై ఇరాన్ డ్రోన్ దాడి

Next Story