- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Iran war : సౌదీ అరేబియాకు ఊహించని షాక్.. ‘అరామ్‌కో రిఫైనరీ’పై ఇరాన్ డ్రోన్ దాడి
Iran war : సౌదీ అరేబియాకు ఊహించని షాక్.. ‘అరామ్‌కో రిఫైనరీ’పై ఇరాన్ డ్రోన్ దాడి
సౌదీ అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జరిగింది. తాజా నివేదికల ప్రకారం మంటలు నియంత్రణలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ ఆసియాలోని ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో సౌదీ అరేబియాలోని ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ‘సౌదీ అరామ్‌కో’ (Saudi Aramco) రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన సౌదీ అగ్నిమాపక సిబ్బంది రిఫైనరీలో చెలరేగిన మంటలను హుటాహుటిన నియంత్రించినట్లుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటనతో వల్ల ప్రాణనష్టం జరగనప్పటికీ, చమురు ఉత్పత్తి, సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై అరామ్‌కో ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు కేంద్రాలపై దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాకు బిగ్ షాక్.. ఇరాన్ దాటికి కువైట్‌లో కూలిన F-15E యుద్ధ విమానాలు
Next Story






