భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Malleboina Mahesh |   (  Updated:2026-06-10 04:29:12  IST  )

లెజెండరీ సినీ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఈ రోజు ఉదయం అనారోగ్యం సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ ప్రపంచం ఒక్కసారిగా విషాదం లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ.. సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సంతాపం తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో భారతీరాజా గారి మరణం భారతీయ చలనచిత్ర రంగానికి , కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు

తన అద్భుతమైన సృజనాత్మక చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు భారతీరాజా అని పవన్ కల్యాణ్ కొనియాడారు. తన కెరీర్‌లో ఏకంగా 6 జాతీయ అవార్డులను అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన తనదైన చెరగని ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవితో భారతీరాజా తెరకెక్కించిన 'ఆరాధన' చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న క్లాసిక్ ఫిల్మ్ 'సీతాకోకచిలుక' వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలలోని సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన క్లాసిక్ దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారని పవన్ కల్యాణ్ శ్లాఘించారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

చిత్రపరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత

Next Story