- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా లా కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం
‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా లా కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం
by Kema Shiva Kumar |
దేశవ్యాప్తంగా ఉన్న లా కాలేజీలపై ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఫుల్ ఫోకస్ పెట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో న్యాయ విద్య (Legal Education) నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా కాలేజీలు, విశ్వవిద్యాలయాల చట్ట విభాగాల్లో సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీల్లో భాగంగా లా కాలేజీల్లో నిర్దేశిత మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఫ్యాకల్టీ, నిబంధనలకు అనుగుణమైన బోధనా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో BCI స్పెషల్ టీమ్స్ పరిశీలించనున్నాయి. ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, నాణ్యమైన న్యాయ విద్యను అందించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి.
Next Story






