- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి వర్షసూచన.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ, తెలంగాణలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే వర్ష ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే వర్ష ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణశాఖ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకానాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే అల్పపీడనం ప్రభావం మాత్రం రాష్ట్రంలో తక్కువగానే ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూలై నెల ముగింపుకు వచ్చినా వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు వరి వేయవద్దని, తక్కువ నీటిని వినియోగించుకునే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఎల్ నినో కారణంగా సాగునీరు, తాగునీరు కరువు లేకుండా ఉండేందుకు చర్యలకు సిద్ధం అవుతున్నారు.






