నేడు ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

by Ajay Maddhiboyina |

సీఎం చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. నేడు ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

నేడు ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. నేడు ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌నను ప‌రామార్శించేందుకు ఉద‌యం 11.15 గంట‌ల‌కు చంద్ర‌బాబు ఆస్ప‌త్రికి చేరుకుంటారు. తిరిగి రాత్రి 8.40కి ఉండ‌వల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే బాల‌కృష్ణ మోకాలికి ఇప్ప‌టికే ఏఐజీ ఆస్ప‌త్రి వైద్యులు స‌ర్జ‌రీ చేశారు. మోకాలికి త‌గిలిన గాయంతో కండరాలు ఉబ్బ‌డంతో స‌ర్జ‌రీ చేసి వాపును త‌గ్గించారు. దాదాపు 3గంట‌ల పాటు ఈ ఆప‌రేష‌న్ జ‌రిగినట్టు వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌గా ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. ఇక బాల‌య్య గాయ‌ప‌డ‌టంతో షూటింగ్ నిలిచిపోయింది. ఆయన పూర్తిగా కోలుకున్నతరవాతనే షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు ప్రకటించాడు.

Next Story