- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్‌బీ పరిశ్రమలో విషాదం.. అనుమానస్పద స్థితిలో కార్మికుడు మృతి
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది.

దిశ,జిన్నారం: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. జీఎస్‌బీ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న రాజు ప్రసాద్(58) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కార్మికుడు ఒక్క సారిగా కింద పడిపోవడంతో వెంటనే పరిశ్రమ యాజమాన్యం ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతదేహంతో జీఎస్‌బీ పరిశ్రమ ప్రధాన గేటు ముందర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలోని పని పరిస్థితుల కారణంగానే రాజు ప్రసాద్ మృతి చెందారని ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ప్రభుత్వాన్ని,పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు.






