అంతర్జాతీయ క్రీడాకారిణికి ఘన సన్మానం

by Jakkula.Mamatha |

చైనాలో జరిగిన ప్రపంచ స్థాయి పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన డిండి గ్రామానికి చెందిన ప్రవళిక వెల్దండ పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ నాయకుడు జూపల్లి భాస్కర్ రావుతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు.

అంతర్జాతీయ క్రీడాకారిణికి ఘన సన్మానం
X

దిశ, చారకొండ: చైనాలో జరిగిన ప్రపంచ స్థాయి పరుగు పందెంలో బంగారు పతకం సాధించిన డిండి గ్రామానికి చెందిన ప్రవళిక వెల్దండ పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ నాయకుడు జూపల్లి భాస్కర్ రావుతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. జూపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ప్రవళిక తాను ఈ స్థాయికి చేరుకున్న సందర్భంలో తన తల్లిదండ్రులు సాధించిన విజయం అని, తాను శారీరక, మానసిక సమస్యలతో పాటు అనేక ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్న సందర్భ అనుభవాలను ఈ సందర్భంగా ప్రవళిక పంచుకున్నారు.మీరు కూడా ఏ రంగంలో ప్రతిభ ఉంటే దానిలో చిన్న చిన్న ఓటములకు భయపడకుండా ముందుకు వెళ్ళాలని క్రీడా కారిణి ప్రవళిక విద్యార్థులకు సూచించారు.

గ్రామీణ ప్రాంతం నుంచి చాలీచాలని ఆర్థిక వనరులతో ప్రపంచ స్థాయిలో బంగారు పతకం సాధించిన ప్రవళిక యువతకు ఆదర్శమని, ప్రతి పోటీ ఎంపికలో అవమానాలు ఎదుర్కొని ప్రపంచ స్థాయిలో నిలబడడం ఆమె పట్టుదల బంగారు పతకం రూపంలో నిలబడిందని సీనియర్ నాయకులు జూపల్లి భాస్కర్ రావు అన్నారు. తీవ్ర స్థాయిలో పోటీ ఎదుర్కొంటున్న ఈ పోటీ ప్రపంచంలో కలలు కన్న లక్ష్యం కోసం ఓ నిరుపేద కుటుంబం నుంచి దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన ప్రవళిక పట్టుదల మరువలేనివని తెలుపుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సమీప గ్రామంతో పాటు మన రాష్ట్రం గుర్తుగా ప్రపంచ స్థాయి క్రీడా కారిణి గ్రూప్ వన్ స్థాయి మంచి ఉద్యోగం కల్పించాలని చారకొండ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పరుగుల క్రీడా కారిణి ప్రవళిక కు జూపల్లి భాస్కర్ రావు రూ.50 వేలు, సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ రూ.20 వేలతో పాటు పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంఈవో ఝాన్సీ, స్థానిక సర్పంచ్ అనూష జగపతి, సీనియర్ నాయకుడు బాలేమియా, జేపల్లి ఉప సర్పంచ్ మధు, వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య,వివిధ యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story