- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ఆధార్ వివరాలిచ్చేటప్పుడు జాగ్రత్త!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల (ఇందిరమ్మ టవర్స్) కేటాయింపు ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల (ఇందిరమ్మ టవర్స్) కేటాయింపు ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. లబ్ధిదారులు, సాధారణ ప్రజలు సైబర్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రూ.10 వేల ముందస్తు డిపాజిట్ (EMD) పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ కాల్స్, మెసేజ్‌లు పంపే ప్రమాదం ఉందన్నారు. "ఈ రోజే ఆఖరు తేదీ, వెంటనే చెల్లించకపోతే ఇల్లు రాదు" అంటూ భయాందోళనలు సృష్టించి డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అంతేకాకుండా, వాట్సాప్ ద్వారా అపరిచిత లింకులు, APK ఫైళ్లను పంపి మొబైల్‌ను హ్యాక్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వెబ్‌సైట్‌ల తరహాలోనే నకిలీ పోర్టళ్లు..
అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి వివరాలు సేకరిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఈ పథకంలో దళారులకు, మధ్యవర్తులకు ఎలాంటి పాత్ర లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ (PIN) లేదా ఓటీపీ (OTP)లను అపరిచితులకు ఇవ్వొద్దు.. స్క్రీన్ షేరింగ్ లేదా రిమోట్ యాక్సెస్ యాప్లను ఇతరుల మాటలు నమ్మి ఇన్‌స్టాల్ చేయకూడదు. డబ్బులు రీఫండ్ పొందడానికి యూపీఐ పిన్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.






