తల్లాడలో మంత్రి తుమ్మల విస్తృత పర్యటన

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం విస్తృతంగా పర్యటించారు.

తల్లాడలో మంత్రి తుమ్మల విస్తృత పర్యటన
X

దిశ,తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కాంగ్రెస్ శ్రేణులను పరామర్శించడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రఘుపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ..

ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి నివాసానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లారు. రఘుపతి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయిందని ఈ సందర్భంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభం..

తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తి - ప్రేమలత దంపతుల ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేసి,రిబ్బన్ కట్ చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ,స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తితో తనకున్న అనుబంధాన్ని, ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన విరాళాలు ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయడం అభినందనీయమని కిషోర్‌ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story