- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల కృష్ణా నదిలో మునిగి డిగ్రీ విద్యార్థి మృతి
by Jakkula.Mamatha |
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల కృష్ణా నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, అచ్చంపేట: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల కృష్ణా నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం గ్రామానికి చెందిన డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాఫర్(19) స్నేహితులతో కలిసి కృష్ణ నదిలో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గత దినం గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న TGFD బృందాలు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, కొంతసేపటి తర్వాత జాఫర్ మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాఫర్ బీసీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. చేతికందిన కొడుకు అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






