- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాలకు క్రమంగా పెరుగుతున్న వరద
by Jakkula.Mamatha |
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ డ్యామ్) వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నాటికి నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.

X
దిశ,జోగులాంబ ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ డ్యామ్) వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నాటికి నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం జరుగుతుంది. డ్యామ్‌లో ప్రస్తుతం 316.120 మీటర్లు (1,037.139 అడుగులు) నీటి మట్టం నమోదైంది. మొత్తం నీటి నిల్వ 5.363 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజ్ 1.656 టీఎంసీలుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 318.516 మీటర్లు, మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు. ఇక నెట్టెంపాడు, భీమా లిఫ్ట్-1, కోయిల్‌సాగర్ లిఫ్ట్, ఎడమ, కుడి ప్రధాన కాలువలు, ఆర్‌డీఎస్ లింక్ కాలువ, ప్యారలల్ కాలువల ద్వారా ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు.
Next Story






