- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. వైద్యుల కీలక ప్రకటన
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనపై వస్తున్న అవాస్తవ ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సీపీఆర్ సహా అత్యవసర చికిత్స అందించగా.. మళ్లీ హార్ట్ బీట్ పునరుద్ధరణ అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఆయనకు న్యూమోనియా (Pneumonia) తీవ్రత ఉండటం వల్ల శరీరం కొంత సహకరించడం లేదని, దానికి సంబంధించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డిని రోహిణి హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు.






