కేసుపల్లిలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర.. వరుణుడు కరుణించాలని ప్రత్యేక పూజలు

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని కేసుపల్లి గ్రామస్తులు వరుణుడు కరుణించాలి, వర్షాలు కురవాలి అని గ్రామదేవతలకు బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు.

కేసుపల్లిలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర.. వరుణుడు కరుణించాలని ప్రత్యేక పూజలు
X

దిశ, ఏన్కూర్: మండల పరిధిలోని కేసుపల్లి గ్రామస్తులు వరుణుడు కరుణించాలి, వర్షాలు కురవాలి అని గ్రామదేవతలకు బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ మొదలై వర్షాలు కురియక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో, వరుణుడు కరుణించాలని గ్రామంలోని మహిళలందరూ బోనమెత్తి గ్రామదేవతలకు పూజలు చేశారు. మండలంలోని కేసుపల్లి, టీఎల్‌పేటతో పాటుగా ఏనుకూరు మండల కేంద్రంలో బొడ్రాయి దగ్గర మహిళలు పూజలు చేసే చేశారు. గ్రామాలలో మహిళలు బోనం ఎత్తడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పార్వతమ్మ, రాణి, పద్మా.. రమాదేవి, కల్యాణి, నాగామణి, సునీత, శామలమ్మ, పవిత్ర, అరుణ, నవీన, నీరజ, తదితరులు పాల్గొన్నారు.

Next Story