TODAY RAIN FORECAST: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో నేడు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉన్న‌ట్టు వెద‌ర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు నుండే రాష్ట్రంలో రుతుప‌వ‌నాలు చురుకుగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

TODAY RAIN FORECAST: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో నేడు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉన్న‌ట్టు వెద‌ర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు నుండే రాష్ట్రంలో రుతుప‌వ‌నాలు చురుకుగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. నేడు ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుండి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా వేశారు. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల,పెద్దపల్లి, భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మద్యాహ్నం నుండి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సౌత్ తెలంగాణలో తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్ లోనూ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్ప‌టికే రాష్ట్రంలో గ‌త కొద్దిరోజులుగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో భద్రాచ‌లం గోదావ‌రికి స్వ‌ల్పంగా వ‌ర‌ద పెరుగుతున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రిలో వ‌ర‌ద వ‌స్తోంద‌ని, ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం వ‌ద్ద 15.3 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరిన‌ట్టు పేర్కొన్నారు.

Next Story